Black Digitals Telugu
*ఆయుర్వేదం అనగా ఆయు ప్లస్ వేదం అని అర్ధం. ఆయు, జీవితాన్ని, వేదం విజ్ఞానాన్ని సూచిస్తుంది.
* ప్రపంచంలోనే అతి పురాతనమైన వైద్య విధానం- ఆయుర్వేదం.
* పేరులోనే జీవిత విజ్ఞానాన్ని ఇముడ్చుకున్న ఆయుర్వేదం పలురకాల వ్యాధులకు సమర్ధమైన చికిత్సా విధానాలను సూచిస్తుంది.
* ఆయుర్వేదం అంటే కేవలం రోగాలకు చికిత్స చేసే వైద్య విధానం మాత్రమే కాదు, అదొక జీవన విధానం.
* మనిషి రోగాల బారిన పడకుండా ఆరోగ్యకరంగా జీవించడానికి అవసరమైన విధి విధానాల్ని నిర్దేశిస్తోంది.
* ఆధునికత చేసిన మేలుతో పాటు కీడు కూడా చాలానే వుంది.
* ఆధునిక జీవనశైలి తెచ్చిపెట్టిన అనర్థాలు ప్రతిఫలం అనుభవిస్తున్నాం.
* ఆధునికత తెచ్చిపెట్టిన అభివృద్ధి జరిగిన మేలు సంగతి అలా వుంచితే మన చుట్టూ వాతావరణ కాలుష్యం పెరిగింది.
* వీటితోపాటు కొత్త కొత్త రోగాలు వ్యాపిస్తున్నాయి.
Black Digitals can give Ayurveadam Simple tips for U
జలుబు--ముక్కుదిబ్బడ
రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ నీటిలో రెండు నిమ్మకాయల రసం పిండి తగినంత పంచదార వేసుకుని త్రాగండి. ఇలా నాలుగు రోజులు సేవిస్తే జలుబు మటుమాయం అవుతుంది.
** అరకప్పు నీటిలో దాల్చిన చెక్క పౌడర్ పావు చెంచా కలుపుకుని మరగబెట్టండి. ఇందులో చిటికెడు మిరియాలపొడి, ఒక చెంచా తేనె వేసి రోజూ రెండుమూడు సార్లు త్రాగండి. ఇలా సేవిస్తే జలుబు దూరమౌతుంది.
** అరలీటర్ నీటిలో 100 గ్రాముల బెండకాయలు ముక్కలుగా తరిగి ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీటి ద్వారా వచ్చే ఆవిరిని పీల్చండి. జలుబు మటుమాయం అవుతుందంటు్న్నారు వైద్యులు.
** పసుపు కొమ్మును కాల్చి ఆ పొగ పీలిస్తే ముక్కుదిబ్బడ తగ్గుతుంది.
** అరచెంచా మిరియాల పొడి, ఒక చెంచా బెల్లంపొడి కప్పునీటిలో వేసి మరిగించి గోరు వెచ్చగా ఉన్నప్పుడే కొద్దికొద్దిగా సిప్ చేయండి.
** కప్పు వేడి పాలలో అరచెంచా సుద్ధమైన పసుపు కలుపుకుని త్రాగండి. ఇలా ప్రతి రోజూ రెండు మూడుసార్లు త్రాగండి.
*వేడి నీటిలో అల్లం ముక్కలు ఉడకపెట్టి కొద్దిగా చక్కెర వేసుకుని వడకట్టుకుని వేడిగా తాగితే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.
* ఒక కప్పు నీటిలో నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసి మరగనిచ్చిన నీరు త్రాగండి ఉపశమనం కలుగుతుంది.
** జలుబుతో బాధపడేవారు చికెన్‌సూప్ తీసుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుందంటున్నారు వైద్యులు.
** ఐదు తులసి ఆకులు తీసుకొని నమలండి. నమిలిన తర్వాత వచ్చే రసాన్ని మింగేయండి. అలా చేయడం ఇష్టం లేకపోతే తులసి ఆకులతో డికాషన్ పెట్టి ఆ డికాషన్‌ను రోజుకు మూడు నాలుగు సార్లు త్రాగండి ఫలితం ఉంటుంది.
** ఒక నిమ్మపండురసం, రెండు కప్పులు గోరువెచ్చని నీటిలో కల్పి ఒక స్పూన్ తేనె కల్పి రోజుకు రెండు మూడు సార్లు తీసుకొంటుంటే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.

visit my ayurveda free treatment website: http://ayurbless.blogspot.in
ReplyDelete